ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ - మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పలు రికార్డులకు వేదిక అయ్యింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ కుషాల్ మల్లా 34 బంతుల్లోనే శతకం బాది ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేస్తే.. మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచులో బ్యాటింగ్ కి దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు. గతంలో ఆఫ్గనిస్తాన్, చెక్ రిపబ్లిక్ జట్ల(20 ఇవర్లలో 278) పేరిట ఈ రికార్డు ఉండేది.
Dipendra Singh Airee's fastest ever fifty in T20i history:
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023
6,6,6,6,6,2,6,6,6.
- A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi
ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ ఇన్ టీ20 క్రికెట్
- దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్) 9 బంతుల్లో vs మంగోలియా
- యువరాజ్ సింగ్ (భారత్) 12 బంతుల్లో vs ఇంగ్లాండ్
- మీర్జా అహ్సన్ (ఆస్ట్రియా) 13 బంతుల్లో vs లక్సెంబర్గ్
- ఆర్ సతీషన్ (రొమేనియా) 14 బంతుల్లో vs సెర్బియా
- ఫైసల్ ఖాన్ (సౌదీ అరేబియా) 15 బంతుల్లో vs కువైట్
- క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) 15 బంతుల్లో vs వెస్టిండీస్