Asian Games 2023: అడుగు దూరంలో గోల్డ్.. భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరంటే..?

Asian Games 2023: అడుగు దూరంలో గోల్డ్.. భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరంటే..?

ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు గోల్డ్ దిశగా అడుగులేస్తోంది. ఈ రోజు(ఆదివారం) బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌-1లో మహిళల క్రికెట్ టీమ్ 8వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఫైనల్ చేరిన టీమిండియా తుది పోరులో శ్రీలంకతో పోరాడుతుంది. ఫైనల్లో భారత్ ఓడినా సిల్వర్ మెడల్ వస్తుంది.
 
తొలి సెమీస్ లో బంగ్లాదేశ్ ని భారత్ చిత్తు చేస్తే.. సెకండ్ సెమీస్ లో పాకిస్థాన్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. తాజాగా ముగిసిన ఈ సెమీ ఫైనల్లో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని లంక మహిళల జట్టు 16.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. రేపు జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు గోల్డ్ మెడల్ కోసం తలపడతాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 11:30 నిమిషాలకు జరుగుతుంది. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో భారత పురుషుల జట్టు శ్రీలంకపై భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత మహిళలు కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Also Read : IND vs AUS: గిల్, అయ్యర్ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా భారత్

శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ టెన్ 1 SD & HD (ఇంగ్లీష్), సోనీ స్పోర్ట్స్ టెన్ 3 SD & HD (హిందీ) మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 4 SD & HD (తమిళం & తెలుగు) TV ఛానెల్‌లు లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. మరి అభిమానుల అంచనాలను అందుకొని మన మహిళల జట్టు గోల్డ్ సాధిస్తుందా..? లేకపోతే లంక ఊహించని షాక్ ఇస్తుందో చూడాలి.