పాలక్‌‌‌‌కు పారిస్​ బెర్త్‌‌‌‌

పాలక్‌‌‌‌కు పారిస్​ బెర్త్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా షూటర్‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ పాలక్‌‌‌‌ గులియా.. పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించింది. ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో పాలక్‌‌‌‌ 217.6 పాయింట్లతో  బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలుచుకుంది. దీంతో ఇండియా తరఫున ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై అయిన 20వ షూటర్‌‌‌‌గా నిలిచింది. క్వాలిఫికేషన్‌‌‌‌లో మెరిసిన పాలక్‌‌‌‌తో పాటు సైన్యమ్‌‌‌‌ కూడా 8 మందితో కూడిన ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించినా తుది పోరులో రాణించలేకపోయింది.