ఆసియన్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో భాగంగా భారత క్రికెటర్లు చైనా వెళ్లిన విషయం విదితమే. ఈ ఈవెంట్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నందున మన క్రికెటర్లు అక్కడ వాతావరణాన్ని అలవాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వింతైన చైనా వంటకాలు తింటూ కనిపించారు. అందులో కొన్ని ఘుమఘుమలు పంచేవి ఉంటే.. మరికొన్ని అవెలా తింటార్రా బాబోయ్ అనిపించేలా ఉన్నాయి.
ALSO READ: Asian Games 2023:37 ఏళ్ళ తర్వాత బ్యాడ్మింటన్ లో భారత్ కి మెడల్..క్వార్టర్ ఫైనల్లో నేపాల్ చిత్తు
చైనా ప్రభుత్వం, నిర్వాహకులు.. విదేశీ అథ్లెట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆసియా క్రీడలకే హైలైట్ అని చెప్పుకోవాలి. వారు తినే పాములు, బల్లులు, కప్పల వంటకాలు కాకుంటే.. ఘుమఘుమలు పంచె స్వదేశీ వంటకాలు కూడా వడ్డిస్తున్నారు. ఆసియా క్రీడల అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ వంటకాలలో డాంగ్‌పో మాంసం, చేపల పులుసు, సాటెడ్ రొయ్యలు, బీజింగ్ తరహా గొడ్డు మాంసం, వెల్లుల్లితో చేసిన వంటకాలు, వేయించిన పంది మాంసం లాంటి ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఇప్పటివరకు చైనీస్ ఫుడ్ అలవాటు లేని మన క్రికెటర్లకు ఈ ఆహారం కాస్త ఇబ్బందైనప్పటికీ.. అయిష్టంగానే తింటున్నారట. ఈ విచిత్రకరమైన చైనీస్ వంటలను మన క్రికెటర్లు మరో రెండు వారాల తినక తప్పదు.
Curious about the go-to dishes of #AsianGames athletes, we explored the Athletes Village to uncover their favourites. ?
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 27, 2023
Let’s dig in! ?? #AsianGames2023 #19thAsianGames #Hangzhou #Hangzhou2023 pic.twitter.com/099pqAZ2qI
షెడ్యూల్ ప్రకారం.. టీమిండియా అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న రెండో మ్యాచ్, 7న మరో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలు ముగిశాక.. టీమిండియా ప్రత్యర్ధులు ఎవరన్నది తేలనుంది. భారత కాలమాన ప్రకారం.. తొలి రెండు మ్యాచ్ లు ఉదయం 6:30 గంటలకు, మూడో మ్యాచ్ ఉదయం 11:30 గంటలకు ఆరంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మొబైల్ ఫోన్ లో SonyLIV యాప్ లో ఈ మ్యాచ్ లు చూడవచ్చు.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.