చైనా ఆసియా గేమ్స్ వాయిదా

చైనా ఆసియా గేమ్స్ వాయిదా

ఈఏడాది సెప్టెంబర్ లో చైనాలోని హాంగ్ జాన్ సిటీలో నిర్వహించాల్సిన 2022 ఆసియా గేమ్స్ వాయిదా పడ్డాయి. ఆసియా గేమ్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య జరగాల్సిన ఆసియా గేమ్స్ ను రీషెడ్యూల్ చేసి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే వాయిదా వేసేందుకు గల కారణాలను తెలపలేదు నిర్వాహకులు. 
ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆసియా గేమ్స్ నిర్వహించాల్సిన హాంగ్ జావ్ ప్రాంతం షాంఘై సిటీకి సమీపంలో ఉంది. గత కొన్ని రోజులుగా షాంఘైలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు ఆసియా గేమ్స్ నిర్వహణ కోసం హాంగ్ జావ్ లో 56వేదికలు రూపొందించినట్లు గత నెలలోనే నిర్వాహకులు తెలిపారు. ఆసియా గేమ్స్ ఈ ఏడాదిలో నిర్వహించే అవకాశం లేదని.. వచ్చే ఏడాదిలోనే పరిస్థితిని బట్టి నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి

అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్

ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న పారా అథ్లెట్ సచిన్ సాహు