ఏషియన్ గ్రానిటో డిస్‌ప్లే సెంటర్ షురూ

ఏషియన్ గ్రానిటో డిస్‌ప్లే సెంటర్ షురూ

హైదరాబాద్​, వెలుగు: టైల్స్ , మార్బుల్స్, క్వార్ట్జ్ , బాత్ వేర్ సొల్యూషన్స్ అమ్మే ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ (ఏజీఎల్ ) హైదరాబాద్‌లో మెగా డిస్‌ప్లే షోరూమ్‌ను ప్రారంభించింది. దీనిని3,500 చదరపు అడుగుల వైశాల్యంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కంపెనీ  అతిపెద్ద డిస్ ప్లే షోరూమ్‌లలో ఇదీ ఒకటని ఏజీఎల్​ తెలిపింది.  

ఇక్కడ అలవారో, స్టోన్ ఎరా, టెరాక్, ప్రెస్టో, మార్బుల్ఎక్స్, గ్రెస్టెక్, గ్రాండ్యురా, స్టైల్ఎక్స్, హార్డ్ స్టోన్, ఫ్రెస్కో వంటి సిగ్నీచర్​కలెక్షన్​అందుబాటులో ఉంటుందని ఏజీఎల్​ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్ తెలిపారు. 

అద్భుతమైన విజువల్స్, ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు,  ఆధునిక షాపింగ్ అనుభవం..ఈ షోరూమ్​ప్రత్యేకతలు అని అన్నారు. ప్రీమియం టైల్స్, జీవీటీ కలెక్షన్లు, స్లాబ్ లు, ఇంజనీరింగ్ చేసిన పాలరాళ్లు, క్వార్ట్జ్, శానిటరీవేర్,  కుళాయిలను ప్రదర్శిస్తామని అన్నారు.