హర్మన్‌‌‌‌ డబుల్‌‌‌‌.. ఇండియా నాలుగో విక్టరీ

 హర్మన్‌‌‌‌ డబుల్‌‌‌‌.. ఇండియా నాలుగో విక్టరీ

హులున్‌‌‌‌బుయిర్‌‌‌‌ (చైనా): ఆసియా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ హాకీ టోర్నీలోఈ డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన నాలుగో మ్యాచ్‌‌‌‌లోనూ 3–1తో కొరియాపై గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించింది. ఈ టోర్నీలో ఇండియాకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇండియా తరఫున అరైజిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (8వ ని), హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (9, 43వ ని) గోల్స్‌‌‌‌ చేయగా, జిహున్‌‌‌‌ యాంగ్‌‌‌‌ (30వ ని) కొరియాకు ఏకైక గోల్‌‌‌‌ అందించాడు.  ఇప్పటికే సెమీస్‌ చేరిన ఇండియా శనివారం జరిగే ఆఖరి లీగ్‌‌‌‌లో  పాకిస్తాన్‌‌‌‌తో తలపడుతుంది.