తగ్గిన ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్

తగ్గిన ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్

న్యూఢిల్లీ: ఏషియన్ పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో రూ. 1,186.79 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.1,574.84 కోట్లతో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ 24.6 శాతం తగ్గింది. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనరల్ ఎలక్షన్స్ జరగడం, హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్స్ తీవ్రంగా ఉండడంతో  పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ తగ్గిందని ఏషియన్ పెయింట్స్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

కంపెనీకి కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.9,182.31 కోట్ల రెవెన్యూ రాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.8,969.73 కోట్లు వచ్చాయి. ఖర్చులు రూ.7,305.09 కోట్ల నుంచి రూ. 7,559.04 కోట్లకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో  డిమాండ్ కనిపించినా, ఈ ఏడాది ప్రారంభంలో పెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు తగ్గడంతో  కంపెనీ ప్రాఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ పడ్డాయి.  కంపెనీ షేర్లు మంగళవారం రూ.2,968 దగ్గర క్లోజయ్యాయి.