42 శాతం పడిన ఏషియన్ పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభం

42 శాతం పడిన ఏషియన్ పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభం

న్యూఢిల్లీ : డిమాండ్ లేకపోవడంతో  ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఏషియన్  పెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్  పడిపోయాయి. ఫలితంగా కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  ఏడాది ప్రాతిపదికన రూ.1,205.42 కోట్ల నుంచి 42.4 శాతం పడి రూ.694.64 కోట్లకు తగ్గింది. రెవెన్యూ ఐదు శాతం క్షీణించి రూ.8,451.93  కోట్ల నుంచి రూ.8,0003.02 కోట్లకు  తగ్గింది.  వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం

కన్జూమర్ డిమాండ్ తగ్గడంతో కంపెనీ సేల్స్ పడిపోయాయని కంపెనీ సీఈఓ అమిత్ సింగ్లే అన్నారు. కిందటేడాది ధరలు తగ్గించడంతో పాటు రామెటీరియల్స్ ధరలు పెరగడంతో  ఆపరేటింగ్ మార్జిన్స్ పడిపోయాయని వివరించారు. తాజాగా ధరలు పెంచడంతో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో  మార్జిన్స్ మెరుగుపడతాయని అంచనా వేశారు.