Asian Paints Q2 result: భారీగా తగ్గిన ఏషియన్ పెయింట్స్ నికర లాభం

Asian Paints Q2 result: భారీగా తగ్గిన ఏషియన్ పెయింట్స్ నికర లాభం

ఏషియన్ పెయింట్స్ నికర లాభం రెండో త్రైమాసికంలో భారీగా తగ్గింది. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 42.5 శాతం పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద పెయింట్ తయారీదారు అయిన ఏషియన్ పెయింట్స్ వ్యాల్యూమ్ 0.5 శాతం తగ్గి లాభాలు 694.64 కోట్లకు పడిపోయాయి. 

FY24 త్రైమాసికంలో రూ.8,451.9 కోట్లు ఉన్న నికర అమ్మకాలు.. 2025 అదే త్రైమాసికంలో ఏషియన్ పెయింట్స్ డిమాండ్ 5.3 శాతం తగ్గి కంపెనీ నికర అమ్మకాలు రూ. 8003 కోట్లకు చేరింది. EBITDA 27.8శాతం క్షీణించి రూ. 1,716.2 కోట్లనుంచి రూ. 1,239.5 కోట్లకు చేరుకుంది. అయితే మార్జిన్ 480 bps నుంచి 15.5కి పడిపోయింది. 

ALSO READ : Intel: ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా..ఉద్యోగులకు ఉచిత కాఫీ, టీలు..ఎందుకో తెలుసా

నిరంతర వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా కంపెనీ ఉత్పత్తుల డిమాండ్ బాగా పడిపోయింది. గతేడాది ధరల తగ్గింపు, మిక్స్ లో మార్పు, పెరిగిన డిస్కౌం ట్ల కారణంగా కూడా ఆదాయం తగ్గిందని ఏషియన్ పెయింట్స్ కంపెనీ తెలిపింది. అయితే స్థిరమైన కరెన్సీ ప్రాతిపదిక ఉన్నప్పటికీ అంతర్జాతీయ పోర్ట్ పోలియో త్రైమాసికానికి 8.7 శాతం ఆదాయం వృద్దిని అందించింది.