ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మనీషాకు గోల్డ్​

ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మనీషాకు గోల్డ్​

అమన్‌‌‌‌ (జోర్డాన్‌‌‌‌): ఇండియా రెజ్లర్‌‌‌‌ మనీషా భన్వాలా.. ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్​ మెడల్​తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 62 కేజీల ఫైనల్లో మనీషా 8–7తో ఒకే జు కిమ్​ (కొరియా)పై నెగ్గింది. సెమీస్​లో మనీషా 5–1తో కల్మిరా బిలింబెక్​ కిజి (కిర్గిస్తాన్​)పై  గెలిచింది. 

అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌‌‌లో టైనస్‌‌‌‌ డుబెక్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌)పై నెగ్గిన మనీషా క్వార్టర్స్‌‌‌‌లో 3–0తో హనిబిట్‌‌‌‌ లీ (కొరియా)ను ఓడించింది. 53 కేజీల బౌట్​లో అంటిమ్​ పంగల్​ 10–0తో మెంగ్‌‌‌‌ సుయాన్‌‌‌‌ సీహ్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ)పై గెలిచి  బ్రాంజ్​ మెడల్​ను సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌‌‌‌లో అంటిమ్‌‌‌‌ 10–6తో జిన్‌‌‌‌ జెంగ్‌‌‌‌ (చైనా)ను ఓడించింది. కానీ సెమీస్‌‌‌‌లో 0–10తో అంటిమ్‌‌‌‌ కొయెకా (జపాన్‌‌‌‌) చేతిలో ఓడింది. అయితే కొయెకా ఫైనల్‌‌‌‌కు వెళ్లడంతో అంటిమ్‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ ఫైట్‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌ వచ్చింది.