
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్‌పోకు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచంలోని ప్రముఖ ఆటో కంపెనీలనీ పాల్గొంటున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఫోక్స్‌వాగన్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, హ్యుండయ్ లాంటి కంపెనీలు ఇప్పటికే తమ న్యూ మోడల్స్‌తో సందర్శకులను జిల్‌జిగేల్‌మనిపిస్తున్నాయి. ఈసారి ఎక్స్‌పో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ ఎక్స్‌పోలో వరల్డ్ కారు అవార్డ్స్ ను ప్రకటించబోతున్నారు. ఈ అవార్డ్స్‌ను వరల్డ్ ఆటో ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. ఈ అవార్డ్స్ దక్కించుకోవడానికి హ్యుండయ్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఐదు వరల్డ్ కారు అవార్డ్స్ కేటగిరీలకు టాప్ 10, టాప్ 5 ఫైనలిస్ట్‌లను ప్రకటిస్తారు. వీరి నుంచి విన్నర్‌ను ఎంపిక చేస్తారు. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఈ సారి ఆటో ఎక్స్‌పోకు చైనీస్ కంపెనీలు ప్రతినిధులు హాజరుకాకపోవడం కాస్త నిరాశపరిచినట్టయింది.