సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఆడియన్స్కి ఎప్పుడు కొత్త అనుభూతే. ఇందులో ఉండే మిస్టరీ థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడలాంటి సినిమానే థియేటర్స్లో దుమ్మురేపుతోంది.
సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజైన రేఖా చిత్రం (Rekhachithram) అనే మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.ఆసిఫ్ అలీ హీరోగా కేవలం రూ.6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటిదాకా రూ.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియాలోనే రూ.15.16 కోట్లు వసూలు చేసింది.ఓవర్సీస్ కలెక్షన్స్ రూ. 14.75 కోట్లు.
Also Read : దుమ్ము రేపుతున్న వెంకీ మామ
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మైండ్కి పదునుపెట్టేలా ఉండటంతో థ్రిల్ అవుతున్నారు. దర్శకుడు జోఫిన్ టి చాకూ రాసుకున్న స్క్రిప్ట్, ఎంగిజింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ మరో వారం రోజులపాటు థియేటర్స్లో దూసుకెళ్ళే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో అనశ్వర రాజన్, మనోజ్ కె జయన్ మరియు సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించారు.
రేఖచిత్రం కథ:
మలక్కప్పరలోని రహస్యమైన కొండల నేపథ్యంలో కథ సాగుతుంది. సీఐ వివేక్ గోపీనాథ్(ఆసిఫ్ అలీ) తన జూదం వ్యసనం కారణంగా సస్పెన్షన్ తర్వాత SHOగా తిరిగి వస్తాడు. డ్యూటీని తిరిగి ప్రారంభించిన కొద్దిసేపటికే.. రాజేంద్రన్ (సిద్ధిక్) ఆత్మహత్యకు సంబంధించిన దర్యాప్తులో విచారణ స్టార్ట్ చేస్తాడు. ఈ విచారణలో భాగంగా రాజేంద్రన్ గురించి తన సహచరులు పాల్గొన్న కొన్ని విషయాలపై దృష్టి పెడతాడు. అలా ఈ కేసుని వివేక్ లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, అతను 1985 చిత్రం కథోడు కాథోరం సినిమా షూటింగ్ ప్రదేశం నుండి ఒక యువతి అదృశ్యం కావడం.. 40 ఏళ్లకు పైగా పాతిపెట్టిన రహస్యాలను ఛేదించడం.. ఇలా ప్రతిఒక్క దాన్ని వెనుకున్న సంబంధాలను వెలికితీస్తాడు. అయితే, రేఖ అనే యువతీ చంపబడిందని.. తాను హీరో మమ్ముట్టికి అభిమాని అని తెలుసుకుంటాడు. అయితే, తనని సినిమా షూటింగ్ సమయంలో హత్య చేసిందెవరు? రాజేంద్రన్ సూసైడ్ వెనుక ఉన్నదెవరు?1985 లో జరిగిన హత్యకు 2024 ఇన్వెస్టిగేషన్ తో తెలిసిన నిజాలేంటనేది సినిమా కథ.