మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్​

ఆసిఫాబాద్: ‘ మీరే అసలు స్మగ్లర్లు, దొంగలు, మీ బిడ్డలు రోడ్డు, బ్రిడ్జిలు లేని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రసవవేదన పడితే మీకు కష్టంతెలిసేది’ అంటూ అటవీశాఖ అధికారు లపై ఆసిఫాబాద్​బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్​ అయ్యారు. ఇవాళ కలెక్టరేట్ లో జడ్పీ సర్వసభ్య సమావేశం  జరిగింది.  సమావేశానికి డీఎఫ్ఓ నీరజ్ కుమార్ కి బదులుగా కాగజ్నగర్ ఇన్​ఛార్జి ఎఫ్డీఓ అప్పలకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పరిధి లోని గ్రామాలకు రోడ్డు, బ్రిడ్జిలకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేయడంపై ఫారెస్ట్  అఫీసర్లపై  ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సమావేశం ఉందని తెలిసినప్పటికీ డీఎఫ్​ఓ హాజరు కాకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. డీఎఫ్​ఓను సరెండర్​ చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే ఆర్​అండ్ బీ, ఇరిగేషన్ అధికారులు పనితీరుపై మండిపడ్డారు. జిల్లాలో పని చేయాలని ఉందా లేదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.