సీఎం ఆదేశాలతో కలెక్టర్ జోడేఘాట్ సందర్శన

ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడ హేమంత్ సహదేవురావు  గురువారం కెరమెరి మండలం కుమ్రం భీం పోరుగడ్డ జోడేఘాట్​ను సందర్శించి అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిని తెలుసుకున్నారు.

మంజూరైన ఇండ్లు, పూర్తికావాల్సిన ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా జోడేఘాట్​లో విద్య, రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల అవసరాలకు సంబంధించిన నివేదిక తయారుచేసి పంపించినట్లు కలెక్టర్​ తెలిపారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులున్నారు.