
ఆసిఫాబాద్, వెలుగు: గేమ్స్ ఆడటం ద్వారా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని, గేమ్స్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. పోలీసులు ఒత్తిడిని తగ్గించుకొనేందుకు క్రీడలు ఆడాలని సూచించారు.
కలెక్టర్, ఎస్పీ కొద్దిసేపు బ్యాడ్మింటన్, టీటీ ఆడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అడ్మిన్ ఎస్పీ ప్రభాకర రావు, ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్, సింగరేణి ఏరియా జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.