మాట వింటలేడని కలెక్టర్‌పై వేటు
కుమ్రంభీం జిల్లాలో రూలింగ్ పార్టీ లీడర్ల రివేంజ్
ల్యాండ్, సాండ్ మాఫియాను అడ్డుకోవడంపై నారాజ్
ప్రజల్లో మంచి పేరు ఉన్నా డోంట్ కేర్
జాయిన్ అయిన తొమ్మిది నెలలకే కలెక్టర్ ట్రాన్స్ ఫర్
ఆసిఫాబాద్, వెలుగు: కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వచ్చిన తొమ్మిది నెలలకే ట్రాన్స్ఫర్కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూలింగ్ పార్టీ నేతలు కలిసికట్టుగా సర్కారు మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ట్రాన్స్‌ఫర్ చేయించారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో అధికార పార్టీ లీడర్లలో అనేక గ్రూపులున్నాయి. కానీ కలెక్టర్ ట్రాన్స్‌ఫర్ విషయంతో వారంతా తమ డిఫరెన్సెస్ పక్కన బెట్టి ఒక్కటయ్యారు. సందీప్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే లోకల్ లీడర్లు ఆయన తీరు మీద నారాజ్‌గా ఉన్నారు. లాండ్ కబ్జాలు, ఇల్లీగల్ ఇసుక మైనింగ్‌ను అడ్డుకోవడం వారికి కంటగింపుగా మారింది. విధి నిర్వహణలో స్ట్రిక్ట్‌గా ఉండడంవల్ల ఎంప్లాయిస్ కూడా కలెక్టర్ మీద ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కలెక్టర్‌ను జిల్లానుంచి సాగనంపేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కలెక్టర్ ఎక్కువ రోజులుండరని, ఆయన బదిలీ ఖాయమని గులాబీ నేతలు కొంతకాలంగా బహిరంగంగానే చెప్తువచ్చారు.
ల్యాండ్, సాండ్ మాఫియాను అడ్డుకున్నందుకే..
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సందీప్ కుమార్ ల్యాండ్, సాండ్ మాఫియా మీద దృష్టి పెట్టారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డిఎంఎఫ్టి) ఫండ్స్‌తో పనులు చేయకుండానే బిల్లులు తీసుకునేందుకు జరిగిన ప్రయత్నాలను కలెక్టర్ సాగనీయలేదు. ఈ బిల్లుల పేమెంట్‌ను నిలిపివేశారు. డీఎంఎఫ్టీ కింద మిడ్డే మీల్స్ స్కీమ్‌కు సంబంధించి అడ్డగోలుగా బిల్లులు పెట్టి, వాటిని క్లియర్ చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. కాగజ్ నగర్లో గవర్నమెంట్ లాండ్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్మించిన షెడ్డును కలెక్టర్ కూల్చివేయించారు. దీంతో అధికార పార్టీ నేతలంతా కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. లీడర్ల అండతో ఎంప్లాయిస్ కూడా ఒక దశలో ఆందోళనకు దిగారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గత జూలైలో స్వయంగా వచ్చి లీడర్లు, కలెక్టర్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరలేదు. అప్పటినుంచి లీడర్ల పైరవీలు మరింత పెరిగాయి. జిల్లాలో కోవిడ్ విస్తరించకుండా అడ్డుకున్నారని, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నారని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ప్రజలు భావిస్తున్న టైమ్‌లో పొలిటికల్ ప్రెజర్ కారణంగా కలెక్టర్ ట్రాన్స్‌ఫర్ కావడం చర్చనీయాంశమైంది.
For More News..