ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఇండ్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు. 

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విద్యార్థుల ఆరోగ్యం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వౄంకటేశ్ ధోత్రే  హెచ్చరించారు. కెరమెరి మండలం మోడి ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్​రూమ్​లు, కిచెన్, రిజిస్టర్లు, నిత్యవసరాలు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.