ఏడాదిలో ఎంతో చేశాం.. మరింత చేయాలి : ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఏడాదిలో ఎంతో చేశాం.. మరింత చేయాలి : ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
  • జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి

ఆసిఫాబాద్, వెలుగు: మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టి బుధవారం ఏడాది పూర్తయిన సందర్భంగా వెంకటేశ్ ​ధోత్రే ‘వెలుగు’తో మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నా నని చెప్పారు.

గడిచిన ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధికి ఎంతో చేశామని, మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో డైవర్సిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయని, మారుమూల ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే...

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

జిల్లాలో వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా జనవరిలోనే యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ నిర్వహించి అలర్ట్ చేస్తున్నం. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నం.

మిషన్ భగీరథ పైప్​లైన్ల లీకేజీ, చేతి పంపుల రిపేర్లు చేస్తున్నాం.నీటి సఫ్లె కోసం విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమున్న చోట ఐటీడీఏ పీవో సమన్వయంతో కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నం. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నం.

సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను వందశాతం అర్హులకు అందిచామని ఆనందంగా ఉంది. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల్లేకుండా అన్ని గ్రామాలకు నిరంతరం కరెంట్​ అందించేందుకు ఐటీడీఏ పీవో సమన్వయంతో యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సమస్య దృష్టికి వస్తే వెంటనే పరిష్కారించేలా చర్యలు తీసుకుంటున్నాం.

హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి బస చేస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ పరిష్కరి స్తున్నాం. ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. డీఎఫ్ వో, ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం.