
కాగజ్ నగర్, వెలుగు : గేమ్స్ ఆడటం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందని ఆసిఫాబాద్డీ ఈఓ అశోక్ అన్నారు. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ వెల్ఫేర్ గ్రౌండ్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించగా డీఈఓ హాజరై మాట్లాడారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను వెలికితీసేందుకు పీటీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
చదువుతో పాటలు ఆటల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో ఆదిలాబాద్ లో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ ఉదయ్ బాబు, డీఎస్ఓ మధుకర్, పీడీలు మధుసూదన్, విష్ణు, వెంకటేశ్, పరమశివ, శారద పాల్గొన్నారు.
Also Read :- నయాగరా వద్ద పేలిన వాహనం .. టెర్రర్ అటాక్ కాదన్న అధికారులు