రుణమాఫీపై ఆందోళన వద్దు: శ్రీనివాసరావు హామీ

కాగజ్ నగర్, వెలుగు: రుణమాఫీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆసిఫాబాద్​జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. బుధవారం చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతు వేదికలో ఆయన మాట్లాడారు.

 రుణమాఫీకి సంబంధించి రైతుల అనుమానాలు తీర్చారు. సాంకేతిక ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భయపడాల్సిన పనిలే దని, విడతల వారీగా మాఫీ అమలవుతుందని చెప్పారు. అనవసరంగా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు.