జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

  •     ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25,322 మంది బాలికలకు, 22,926 మంది బాలురకు యూనిఫామ్ అందించనున్నట్టు తెలిపారు.

స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతో విద్యార్థులకు దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్​ భద్రపరిచిన గోదాంను కలెక్టర్ పరిశీలించారు. అలాగే అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ మరమ్మత్తుల పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.