డీపీఓగా భిక్షపతి గౌడ్ బాధ్యతల స్వీకరణ

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా బి.భిక్షపతి గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి డీఎల్ పీఓగా పనిచేసిన ఆయన పదోన్నతిపై ఆసిఫాబాద్ డీపీఓగా నినియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టి పల్లెల ప్రగతికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామన్నారు.