అక్రమంగా అమ్ముతున్న..ఆశ్రమ హాస్టల్ బియ్యం పట్టివేత

జైనూర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నపూర్ గిరిజన ఆశ్రమ హాస్టల్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్న నిర్వహకులను విద్యార్థులే పట్టుకున్నారు. కొన్ని రోజులుగా హాస్టల్ నిర్వాహకులు  మెనూ  పాటించడం లేదని,   హాస్టల్ బియ్యం అమ్ముకుంటున్నట్లు  స్టూడెంట్స్ తమ పేరెంట్స్ తో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు.  ఎవరూ స్పందించలేదని ఆవేదనతో..  

తరలిపోతున్న సరుకులపై  నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ స్టోర్​  రూమ్ దగ్గర లోడ్ చేసిన ఆటో ను విద్యార్థులు పట్టుకున్నారు.  అందులో 15 బస్తాలు సుమారు 7. 5 క్వింటాళ్ల  బియ్యం  ఉన్నట్టు  స్టూడెంట్స్ తెలిపారు.

ఈ విషయమై జైనూర్ ఏటీడీవో పురుషోత్తంను వివరణ కోరాగా పట్నపూర్ హాస్టల్ లో శనివారం అర్ధరాత్రి  ఈ ఘటన జరిగిందని,  వివరాలు ఐటీడీఏ పీఓ  దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.  స్టూడెంట్స్​తోపాటు,  హాస్టల్ హెచ్ఏం విచారించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.