ఆసిఫాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న 50 ఫోన్లు అందజేత

ఆసిఫాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న 50 ఫోన్లు అందజేత

ఆసిఫాబాద్, వెలుగు: మొబైల్ పోతే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. గత మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 50 ఫోన్లను గుర్తించి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు వాటిని అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్లను నేర స్తులు దొంగిలిస్తే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.

మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ

శాంతిభద్రతలతో పాటు ప్రజాసేవలోనూ పోలీసులు ముందుంటారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రతి మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి రోజు 500 మందికి మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్.ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు రవీందర్, సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ రాణా ప్రతాప్, డీసీఆర్బీ ఇన్​స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.