ఆసిఫాబాద్ పట్టణంలో బంద్ పాటించిన కూరగాయల వ్యాపారులు

ఆసిఫాబాద్ పట్టణంలో బంద్ పాటించిన కూరగాయల వ్యాపారులు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు సోమవారం బంద్ పాటించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్​లో కాకుండా పట్టణంలోని వివేకానంద, గాంధీ చౌక్​లో కూరగాయల వ్యాపారాన్ని కొంత మంది ప్రోత్సాహించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా అమ్మకాలు నిలిపివేశారు. జిల్లా ఆవిర్భావం తర్వాత వివేకానంద చౌక్ లో పెరిగిన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ. 3 కోట్లతో జూబ్లీ మార్కెట్ నిర్మించారని, కానీ కొందరి ప్రోత్సాహంతో మార్కెట్​ను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

 మంగళవారం కూడా బంద్ పాటిస్తామని వ్యాపారులు తెలిపారు. జూబ్లీ మార్కెట్​లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్​వో లోకేశ్వర్ రావు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.