క్రీడారంగ అభివృద్ధికి సర్కార్ కృషి : కోవ లక్ష్మి

ఆసిఫాబాద్, వెలుగు : క్రీడారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా గ్రామ పంచాయతీలకు క్రీడా సామగ్రి పంపిణీ చేసినట్లు ఆసిఫాబాద్​ జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి రమాదేవితో కలిసి క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం ముఖ్యమని.. ఇందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అందుకే గ్రామీణ ప్రాంత యువత కోసం క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గుండెపోటుతో మరణించిన కాగజ్ నగర్ ఆర్డీవో జాడి రాజేశ్వర్​కు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.