ఎన్నారైను బెదిరించిన నకిలీ రిపోర్టర్​పై కేసు

ఎన్నారైను బెదిరించిన నకిలీ రిపోర్టర్​పై కేసు

మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నారైను బెదిరించిన ఓ ఫేక్​ న్యూస్​ రిపోర్టర్ పై ఆసిఫ్​నగర్​ పోలీసులు కేసు ఫైల్​చేశారు. ఇరాదుల్లా ఖాన్(53) అనే ఎన్నారై ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధి ఆలపాటి నగర్​లో మూడంతస్తుల బిల్డింగ్​నిర్మిస్తున్నాడు. అది గుర్తించిన మహ్మద్​యూనస్​అనే వ్యక్తి ఇరాదుల్లాఖాన్​ను కలిశాడు. 

న్యూస్​రిపోర్టర్​ని అని పరిచయం చేసుకున్నాడు. తనకు రూ.15 లక్షలు ఇవ్వకపోతే అక్రమ నిర్మాణం పేరుతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, నిర్మాణ పనులు ఆగిపోతాయని బెదిరించాడు. యూనస్ అస్సలు న్యూస్​రిపోర్టరే కాదని తెలుసుకున్న ఇరాదుల్లా ఖాన్​ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్​వెంకటేశ్వర్లు తెలిపారు.