టీమిండియాతో టీ20,వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా మొత్తం పర్యటనకు దూరమయ్యాడు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో చమీర బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీనియర్ పేస్ బౌలర్ స్థానంలో అసిత ఫెర్నాండోను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం (జూలై 25) అధికారికంగా ప్రకటించింది.
26 ఏళ్ల అసిత ఫెర్నాండో శ్రీలంక తరపున టెస్ట్ మ్యాచ్ లో రెగ్యులర్ బౌలర్. ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో 10 మ్యాచ్ ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ను మంగళవారం (జూలై 23) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.
భారత్ సిరీస్ కోసం శ్రీలంక టీ20 జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్ ), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార,అసిత ఫెర్నాండో, బి. ఫెర్నాండో
Asitha Fernando has been called up to replace the injured Dushmantha Chameera for the upcoming white-ball series against India.
— CricTracker (@Cricketracker) July 25, 2024
Read more at: https://t.co/A26GvVO7JH pic.twitter.com/1D6Nz7lAR4