ఐపీఓకు దరఖాస్తు చేసిన ఆస్క్​ ఆటోమోటివ్

ఐపీఓకు దరఖాస్తు చేసిన ఆస్క్​ ఆటోమోటివ్

న్యూఢిల్లీ: ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులను సేకరించేందుకు ఆస్క్​ ఆటోమోటివ్ క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటర్​ సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది.  ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) విధానంలో ఉంటుంది. ప్రమోటర్లు -- కుల్దీప్ సింగ్ రాఠీ,  విజయ్ రాఠీ  2,95,71,390 ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ప్రస్తుతం, ఆస్క్​ ఆటోమోటివ్‌‌లో కుల్దీప్‌‌కు 41.33 శాతం వాటా,  విజయ్​కు 32.3 శాతం వాటా ఉంది. ఐపీఓ పూర్తిగా ఓఎఫ్​ఎస్​ అయినందున, మొత్తం ఆదాయం  వాటాదారులకు వెళుతుంది.  

 గురుగ్రామ్‌‌కు చెందిన ఆస్క్​ ఆటోమోటివ్ టూవీలర్ల కోసం బ్రేక్-షూ, అడ్వాన్స్​డ్​ బ్రేకింగ్ (ఏబీ) సిస్టమ్‌‌లను తయారు చేస్తుంది.  దీనికి సుమారు 50 శాతం మార్కెట్ వాటా ఉంది. సేఫ్టీ సిస్టమ్స్​, క్రిటికల్​ ఇంజనీరింగ్​ సొల్యూషన్స్​ను కూడా డెవెలప్​ చేస్తుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ,  బజాజ్ ఆటోతో సహా పలు ప్రముఖ కంపెనీలు దీనికి క్లయింట్లు.