
కాగజ్ నగర్, వెలుగు: నియోజకవర్గ ప్రజల గురించి నిరంతరం తపించే నాయకుడు కోనేరు కోనప్ప అని ఆయన సతీమణి కోనేరు రమాదేవి అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ, 21, 23 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్, కౌన్సిలర్లతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు తమ వంతుగా ప్రజలకు చేస్తున్న సేవను వివరించారు.
పట్టణంలోని అన్ని వర్గాలకు తమవంతు సహకారం అందించామని, మరోసారి కోనేరు కోనప్పకు అవకాశం ఇవ్వాలని కోరారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే వారిని నమ్మొద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ లు సీపీ విద్యావతి రాజ్ కుమార్, దస్తగిరి, ఆయా కాలనీల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.