
హైదరాబాద్, వెలుగు: సమాజానికి మేలు చేసే హార్డ్వేర్లను సృష్టించిన మూడు భారతీయ వెంచర్లకు అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఎ.ఎస్.ఎం.ఇ.) అవార్డులు అందజేసింది. హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో శుక్రవారం నిర్వహించిన సామాజిక ఆవిష్కరణల యాక్సిలరేటర్ (ఐషో) ఇండియా 2025లో వీటిని ప్రదానం చేశారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం భారతదేశం అంతటా ఉన్న హార్డ్‌వేర్ సోషల్ఎంట్రప్రినార్లను ఒకచోట చేర్చింది. వీరందరూ వ్యవసాయం, శక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణారంగాల్లోని సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తున్నారు. చులివ్ (న్యూరప్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), సెప్-స్కాన్ (ఫాస్ట్‌సెన్స్ ఇన్నోవేషన్స్), సోలార్-పవర్డ్ అగ్రికల్చరల్ రోబోటిక్ బుల్ (కిసాన్ రోవర్) అవార్డులను సాధించాయి.