జైనూర్, వెలుగు: ఏజెన్సీ ప్రాంత గ్రామస్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం తోడుగా ఉంటుందని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం లింగాపూర్ మండలంలోని చోర్పల్లి గ్రామంలో ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, ఎస్సై గంగన్న, సిర్పూర్ యు ఎస్సై రామకృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.