రూ.2.50 కోట్లతో భద్రాచలం టౌన్ పోలీస్​ స్టేషన్ ​బిల్డింగ్​ : పంకజ్​పరితోష్

రూ.2.50 కోట్లతో భద్రాచలం టౌన్ పోలీస్​ స్టేషన్ ​బిల్డింగ్​ :  పంకజ్​పరితోష్

భద్రాచలం, వెలుగు :  రూ.2.50కోట్లతో భద్రాచలం టౌన్​ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం ఏఎస్పీ పంకజ్​పరితోష్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో భద్రాద్రికొత్తగూడెం మొదటి స్థానంలో ఉంది. 

ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్​ భవనాలను పటిష్ట పరిచేందుకు కేంద్ర హోంశాఖ ఎల్​డబ్ల్యూఈ స్కీం కింద నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడాదిలోపే కొత్త టౌన్​పోలీస్ స్టేషన్​భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఏఎస్పీ పంకజ్​పరితోష్ తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగరాజురెడ్డి, ఎస్సైలు మధుప్రసాద్, పీవీఎన్​రావు, విజయలక్ష్మి, పోలీస్​ హౌసింగ్​బోర్డు డీఈ రాందాసు, కాంట్రాక్టర్​ మాలకొండయ్య పాల్గొన్నారు.