ఆస్పర్టెమ్తో క్యాన్సర్ వస్తుందా..? డబ్ల్యూహెచ్వో ఏం చెబుతుందంటే..

ఆస్పర్టెమ్తో క్యాన్సర్ వస్తుందా..? డబ్ల్యూహెచ్వో ఏం చెబుతుందంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నాన్ షుగర్ స్వీటెనర్ అస్పర్టేమ్ పై కీలక ప్రకటన చేసింది. ఆస్పర్టెమ్ క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. అయితే రోజులో ఒక వ్యక్తి శరీర బరువులో కిలో గ్రాముకు 40 మిల్లీ గ్రాముల చొప్పున  తీసుకోవడం సురక్షితమే అని పేర్కొంది. ఇంటర్ నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ క్యాన్సర్ (IARC ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) జాయింట్ ఎక్స్ ఫర్ట్ కమిటీ ఆన్ ఫుడ అడిటివ్స్ (JECFA) అస్పర్టెమ్పై  అధ్యయనం తర్వాత అంచనాలను విడుదల చేసింది.  మానవులలో కార్సినో జెనిసిటికి కారణంగా ఉదహరిస్తూ అస్పర్టెమ్ మానవులకు క్యాన్సర్ కారకం అని వర్గీకరించింది. 

ఆస్పర్టెమ్ అనేది వివిధ రకాల ఆహార పదార్థాలు, పానియాల ఉత్పత్తుల్లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్. డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, అల్పాహారం తృణధాన్యాలు, టూత్ పేస్ట్ దగ్గు మందులు, పలు రకాల విటమిన్లలో అస్పెర్టెమ్ ను వాడతారు. మానవులలో జంతువులలో క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ ఎలా సంభవిస్తుందని అంశాలపై IARC కి చెందిన డాక్టర్ మేరీ షుబైర్- బెరిగన్ పరిశోధనలు జరిపారు. ఆస్పర్టెమ్ వినియోగంతో సంబంధం ఉన్న క్యాన్సర్ కారక ప్రమాదం, ఇతర ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేయడానికి రెండు సంస్థలు పరిశోధనలు నిర్వహించాయి. ఈ పరిశోధనల్లో ఆస్పర్టెమ్ క్యాన్సర్ కారకమేనని నిర్ధారించారు.