
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: బీజేపీ టికెట్కోసం ఆదివారం సైతం దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ఆఫీసులో దరఖాస్తు సమర్పించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్చెన్నూర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి వెళ్లి అప్లికేషన్ అందించారు.
ఆయన వెంట భీమారం మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్తదితరులున్నారు. పట్టణానికి చెందిన అడ్వకేట్ రాంబాబు సైతం చెన్నూర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ నియోజకవర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అప్లై చేశారు.
నాయకులు రావుల రామనాథ్, మెడిసిమ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, ముత్యంరెడ్డి తదితరులు మహేశ్వర్ రెడ్డి తరఫున దరఖాస్తును రాష్ట్ర నేతలకు అందజేశారు. సిర్పూర్ టీ అసెంబ్లీ టికెట్ కోసం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అప్లై చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు కూడా సిర్పూర్ టీ సీటు కోసం అప్లికేషన్ చేసుకున్నారు.