గ్రూప్1 ప్రిలిమ్స్ లో స్టడీ సర్కిల్స్ అభ్యర్థుల హవా

గ్రూప్1 ప్రిలిమ్స్ లో స్టడీ సర్కిల్స్ అభ్యర్థుల హవా

హైదరాబాద్​, వెలుగు:  ప్రభుత్వ స్టడీ సర్కిల్స్​ లో ప్రిపేరైన గ్రూప్1 అభ్యర్థులు ప్రిలిమ్స్​లో సత్తాచాటారు. సిటీలోని బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్ నుంచి మొత్తం 176 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు.  బీసీ స్టడీ సర్కిల్ లో 205 మంది కోచింగ్​తీసుకోగా, 50 మంది సెలెక్ట్ అయ్యారు. ఇందులో 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఎస్సీ స్టడీ సర్కిల్ లో 126 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిళ్లలో 473 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్​ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్​ సిద్ధం చేస్తామని బీసీ స్టడీ సర్కిల్​ డైరెక్టర్​ శ్రీనివాసరెడ్డి చెప్పారు.  ఈనెల 22 నుంచి మెయిన్స్​ కు 75 రోజులు కోచింగ్​ ఇస్తామని, ఇప్పటికే నోటిఫికేషన్​ విడుదల చేశామని తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి, ఎస్సీ స్టడీ సర్కిల్​ప్రెసిడెంట్ ఐఏఎస్​ఎన్​. 

శ్రీధర్​కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫండ్స్​ రిలీజ్ చేయడంతోనే జిల్లా స్టడీ సర్కిళ్లలో స్పెషల్ కోచింగ్​ఇస్తున్నామని వెల్లడించారు. స్టడీ సర్కిళ్లలో కోచింగ్​ తీసుకొని ఎంతో మంది నిరుద్యోగ యువత స్టేట్, సెంట్రల్ జాబ్స్​సాధిస్తున్నారని  బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు.