కందుకూరు, వెలుగు : సిమెంట్ బ్రిక్స్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాలోని ఓ పంచాయతీ సెక్రటరీ, ఎంపీవో ఏబీసీకి పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం రాచలూరులోని సిమెంట్ బ్రిక్స్ యజమాని మధుసూదన్ రెడ్డికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులు ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్ కోసం పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఎంపీవో కల్యాణిని సంప్రదించాడు.
గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చేందుకు వారు రూ.5 లక్షలు డిమాండ్ చేయగా.. రూ.2 లక్షల 50 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో మధుసూదన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఎంపీవో కల్యాణి.. మధుసూదన్ రెడ్డి నుంచి రూ.20 లక్షల 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామన్నారు.