
కాశీబుగ్గ, వెలుగు: నీట్ ఫలితాల్లో తమ స్టూడెంట్లు రికార్డ్ క్రియేట్ చేశారని ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి అన్నారు. ఎస్సార్ లో చదివిన శ్రుత కీర్తి 662 మార్కులు, పి.హర్షిత 652, కె.రమేశ్ 630, ఎం. కీర్తి 626, టి. షాలిని 621, వి. సాయి ప్రసాద్ 621 మార్కులు సాధించారని వివరించారు. 105 మందికి పైగా స్టూడెంట్స్500 మార్కులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వస్తున్న మార్పులను గమనిస్తూ.. విద్యార్థులకు చక్కటి సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లుగా వరదారెడ్డి పేర్కొన్నారు.