స్టూడెంట్లు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలి

స్టూడెంట్లు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలి

బాన్సువాడ రూరల్, వెలుగు :విద్యార్థులు టీవీ, పోన్లకు దూరంగా ఉండాలని ఏఎస్​ఆర్​ ఫౌండేషన్​ చైర్మన్​ మొహరిల్​ శ్రీనివాస్​రావు అన్నారు.  ఆదివారం బాన్సువాడ పట్టణంలోని సాయికీర్తి జూనియర్​ కళాశాలలో టీజీ సెట్​ మోడల్​ టెస్ట్​ను నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

 రాష్ట్ర ప్రస్తుతం గురుకులాల్లో ఉచిత విద్యను అందిస్తుందని, వాటిని వినియోగించుకోవాల్నారు.  అనంతరం మోడల్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు  బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్​ఆర్​ ఫౌండేషన్ వ్యవస్థపాకులు అయ్యాల సంతోశ్​, ఫౌండేషన్ సభ్యులు కల్లూరి రాజారాం, రోటె సాయిలు,  పర్వయ్య, నాగరాజు, మన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు.