అసోంలోని నాగావ్ జిల్లాలో ఓబాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితు లను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లో వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నాగావ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి.
డ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న మైనర్‌ను స్థానికులు రక్షించారు. వారు పోలీసులకు సమాచారం అందించగా బాధితురాలనిి ఆసుపత్రికి తరలించారు. సంఘటన వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రంలో భారీ నిరసనలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఈ దారుణ ఆకృత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడికోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అసోం అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి శుక్రవారం ఉదయం (ఆగస్టు 23, 2024న) పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య దుకాణదారులు తమ వ్యాపార సంస్థలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. సామాజిక, రాజకీయ సంస్థలు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని , మహిళలు , బాలికలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ GP సింగ్‌ను ఢింగ్‌కు చేరుకున్నారు.
ALSO READ | కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ కస్డడీ
బాలికపై సామూహిక అత్యాచారం ఘటనను అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. థింగ్లో మైనర్పై సామూహిక అత్యాచారం తీవ్రంగా కలిచివేసింది.. మానవత్వాన్ని మంటగలిపే ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోం.. ఈ ఘటనలో ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. డీజీపీ సంఘటనా స్థలాన్ని వెళ్లి.. విచారణ జరపాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.