అసోంలోని చరాయిడియా మైదమ్ సమాధి కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతాన్ని చేర్చారు. ఈజిప్టు పిరమిడ్స్ తరహాలో తూర్పు అసోంను పాలించిన అహోమ్ చక్రవర్తులు ఇక్కడ తమ సమాధులను నిర్మించారు. చరాయిడియో మైదమ్ను చక్రవర్తులు ఖనన ప్రదేశంగా పిలుస్తారు. మైదమ్ అంటే పుట్ట తరహాలో భూమిపై ఎత్తుగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.
తూర్పు అసోం ప్రాంతాన్ని 600 ఏళ్లు అహోమ్ రాజులు పాలించారు. బ్రిటీషర్లు రాకకు ముందు ఇక్కడ ఆ రాజుల పాలనే ఉండేది. పిరమిడ్స్ తరహాలో ఇక్కడ సమాధి గడ్డలను నిర్మించారు.
చరాయిడియో మైదమ్ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చే నిర్ణయాన్ని భారత్లో జరిగిన 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో తీసుకున్నారు. ఇంటర్నేసనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యమెంట్స్, సైట్స్ మొయిదమ్ గురించి ప్రతిపాదన చేసింది.