- 317జీవో రద్దుకు మద్దతు పలకనున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
హనుమకొండ జిల్లా: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రేపు హనుమకొండకు రానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని.. రాష్ట్ర ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యల పై పోరాడుదాం... బీజేపీ కార్యకర్తల పై దాడులను ఖండిదాం... అని నినదిస్తూ రేపు ఆదివారం తలపెట్టిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు.
హనుమకొండ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్స్ ఎదురుగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ ఓబిసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి
ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా