ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...

ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆధార్ కార్డు అప్లికేషన్ పై సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇకపై అస్సాంలో  కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తమ ఎన్ఆర్సీ ( NRC )  నంబర్‌ను కూడా జత చేయాలని నిర్ణయించింది అస్సాం ప్రభుత్వం. ఈ కొత్త రూల్ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం ( సెప్టెంబర్ 7, 2024 ) ప్రకటించారు.

రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కోసం దరఖాస్తులు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దరఖాస్తు చేసుకున్నవారిలో అనుమానిత వ్యక్తులు ఉండే అవకాశం ఉందని అన్నారు. అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఈ  నిర్ణయం తీసుకున్నామని తెలిపారు హిమంత బిశ్వ శర్మ. ఇకపై అస్సాంలో ఆధార్ పొందడం అంత ఈజీ కాదని అన్నారు.

Also Read:-భారీ వర్షాలతో తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల వివరాలు ఇవే!

ఎన్ఆర్‌సీ సమయంలో బయోమెట్రిక్ లాక్ అయిన 9.55 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ అప్లికేషన్ నెంబర్ జత చేయాల్సిన అవసరం లేదని, వాళ్లకు మాత్రం ఆధార్ కార్డులు జారీ అవుతాయని సీఎం చెప్పారు. అసంలోకి అక్రమంగా చొరబడేవారిని గుర్తిస్తున్నామని, ఇందుకోసం యంత్రంగం వేగవంతంగా పనిచేస్తోందని అన్నారు. గత రెండు నెలల్లో అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకొని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు సీఎం హిమంత బిశ్వ శర్మ.