CRPF డైరెక్టర్ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ అపాయింట్‌మెంట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్‌.. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా విధుల్లో ఉన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్‌లో ఆరేళ్లు, అస్సాం సహా ఈశాన్య ప్రాంతాలలో 18 ఏళ్లకు పైగా పనిచేశారు. ఈయన నార్త్ అస్సాం IGగా కూడా పనిచేశారు. 

Also Read :- సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!

ఈయన సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నవంబర్ 30, 2027 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.