అసోంలో వరద బీభత్సం..24 గంటల్లో 8మంది మృతి

అసోంలో వరద బీభత్సం..24 గంటల్లో 8మంది మృతి

అసోంను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. 24 గంటల్లో 8మంది మృతిచెందారు.ఈ సీజన్ లో మృతుల సంఖ్య 46 కు చేరిందని అసోం ప్రభుత్వం ప్రకటించింది. 29 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 16 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర, డిగేరు, కొల్లాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతుండటంతో  వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. పంటలన్నీ నీట మునిగాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.   అసోం లోని కజరింగ నేషనల్ పార్క్ మొత్తం జలమయమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఆర్ఆఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి.  2024లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య భారీగా ఉంది. ఈ ఏడాదిలో భారీ వర్షాలు, వరదలతో 56 మంది మృతిచెందినట్టు, కొంతమంది గల్లంతైనట్లు అసోం ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

బర్‌పేట, బిస్వనాథ్, కాచర్, చరైడియో, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, గోల్‌పరా, గోలాఘాట్, హైలాకండి, హోజై, జోర్హాట్, కమ్‌రూప్, కమ్‌రూప్ మెట్రోపాలిటన్, ఈస్ట్ కర్బీ అంగ్లాంగ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, లఖిమ్‌పూర్ అంగ్లాంగ్ ప్రాంతాల్లో  వరద బీభిత్సం సృష్టించింది. మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరి, శివసాగర్, సోనిత్‌పూర్ టిన్సుకియా జిల్లాల్లో కూడా వరదల కారణంగా భారీగా నష్టం జరిగింది. 

ధుబ్రీలో 2.23 లక్షల మందికి పైగా ప్రజలు అష్టకష్టాలు పడగా, దాదాపు 1.84 లక్షల మందితో దర్రాంగ్ మరియు 1.66 లక్షల మందికి పైగా లఖింపూర్‌లో వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిమతిఘాట్, తేజ్‌పూర్, గౌహతి, గోల్‌పరా మరియు ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలను మించి ప్రవహిస్తోంది.

వరదలు, భారీ వర్షాలతో ధుబ్రీలో 2.23 లక్షల మందికి పైగా ప్రజలు అవాసాలు కోల్పోయి ఇబ్బందుతు పడుతున్నారు. దర్రాంగ్ లో దాదాపు 1.84 లక్షల మంది .. 1.66 లక్షల మందికి పైగా లఖింపూర్‌లో వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిమతిఘాట్, తేజ్‌పూర్, గౌహతి, గోల్‌పరా, ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.