కొవిడ్ లాక్ డౌన్ లో వికసించిన ఓ ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ఓ భర్త తన భార్య, అత్తమామను హత్య చేసి 9 నెలల పాపతో చివరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో కథ కంచికి చేరింది. ఈ లవ్ స్టోరీ కం, ముగ్గురి మర్డర్ స్టోరీ అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే.. 2020 జూన్ లో దేశ వ్యాప్తంగా కొవిడ్ లాక్ డౌన్ సమయంలో నజీబుర్ రెహమాన్ బోరా అనే మెకానికల్ ఇంజినీర్(25)కు సంఘమిత్ర(24)అనే అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.. నెలలోపే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి అదే ఏడాది అక్టోబర్ లో కోల్ కతాకు పారిపోయారు.
ఈ విషయం తెలిసిన సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్, జును ఘోష్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్ కతాలోని కోర్టులో నజీబుర్ ను పెళ్లి చేసుకుంది. 2021లో సంఘమిత్రపై ఆమె తల్లిదండ్రులు దొంగతనం కేసు పెట్టారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెలపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తర్వాత బెయిల్ పై వచ్చిన సంఘమిత్ర తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అక్కడే ఉంటుంది.
2022 జనవరిలో సంఘమిత్ర తన భర్త నజీబుర్ తో కలిసి మళ్లీ చెన్నైకి పారిపోయింది. కొన్ని నెలల తర్వాత గోలాఘాట్ లోని నజీబుర్ ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే సంఘమిత్ర ఐదు నెలల గర్భవతి. ఇద్దరు కలిసి కొన్ని రోజులు ఉన్నారు. నవంబర్ లో సంఘమిత్ర ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.
2023లో మార్చిలో సంఘమిత్ర తన భర్త నజీబుర్ ఇంటిని వదిలి బాబుతో కలిసి తన అమ్మనాన్న ఇంటికి వెళ్లింది. తన భర్త నజీబుర్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నజీబుర్ ను అరెస్ట్ చేశారు.
28 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన నజీబుర్ తన కొడుకును కలవాలని సంఘమిత్ర ఇంటికి వెళ్లాడు. కానీ తన అత్తమామలు అందుకు అంగీకరించలేదు. ఏప్రిల్ 29న సంఘమిత్ర,ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్ పై దాడి చేశారని నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో 2023 జూలై 24న నజీబుర్ తన భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులను హత్య చేసి తొమ్మిది నెలల బాబుతో పారిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడిపై హత్య, ఇంట్లో చొరబాటు కేసు నమోదు చేసినట్లు అస్సాం పోలీస్ చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ కేసును విచారించేందుకు అస్సాం సీఐడీని కూడా రంగంలోకి దింపారు.
అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా జులై 26 బుధవారం గోలఘట్ లోని సంఘమిత్ర ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడు ముస్లీం అని.. ముగ్గురిని మర్డర్ చేయడం లవ్ జిహాదీగా చెప్పారు. నిందితుడిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపేందుకు 15 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయిస్తామని హామీ ఇచ్చారు.
In Assam, be it Nazibur Rahman or any other individual, we stand firm in our commitment that crime has no place in our state. Our resolve remains unwavering – no criminal shall escape justice.
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2023
?Golaghat pic.twitter.com/xEosJ1IRc3