పుల్వామా, పహల్గాం ప్రభుత్వ కుట్ర అంటూ కామెంట్లు అస్సాం ఎమ్మెల్యే ఇస్లాం అరెస్ట్

పుల్వామా, పహల్గాం ప్రభుత్వ కుట్ర అంటూ కామెంట్లు అస్సాం ఎమ్మెల్యే ఇస్లాం అరెస్ట్

గౌహతి/న్యూఢిల్లీ: పుల్వామా, పహల్గాం టెర్రరిస్టు దాడులు ప్రభుత్వ కుట్రలంటూ ఆరోపించిన అస్సాంఏఐయూడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ‘‘పుల్వామాలో సీఆర్పీఎఫ్కా న్వాయ్​పై సూసైడ్ ఎటాక్​, పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చిచంపడం ప్రభుత్వం కుట్ర’’ అని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) డింగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అస్సాం రాష్ట్ర పోలీసులు అతనిపై సుమోటో గా కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్టు చేశారు. ఇది అమినుల్ ఇస్లాం వ్యక్తి గత ప్రకటనని  ఏఐయూడీఎఫ్ పార్టీ చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. అమీనుల్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.