సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అసోం పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. వివిధ బిజెపి మద్దతుదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు పెడతామన్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు ఆధారాలు కావాలంటూ ఆర్మీని ప్రశ్నించినందుకు, భారత వ్యతిరేక భావాలను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎంపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అస్సాం పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేవలం అస్సాం చుట్టే తిరుగుతున్నాయి. అసో ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంపై అస్సాం సీఎం చాలా నీచంగా మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ కంటే మొదటగా స్పందించారు.రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాలన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్​ స్పష్టం చేశారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు

పెద్ద పారిశ్రామికవేత్తలే ప్రయోజనం పొందుతున్నారు