అస్సాం అత్యాచార ఘటన నిందితుడు చెరువులో దూకి మృతి

అస్సాం అత్యాచార ఘటన నిందితుడు  చెరువులో దూకి మృతి
  • పోలీసులు క్రైం సీన్ రీక్రియేట్చేస్తుండగా ఘటన
  • 2 గంటల తర్వాత డెడ్​ బాడీ వెలికితీత

న్యూఢిల్లీ: అస్సాంలో పదో తరగతి బాలికపై అత్యాచారం ఘటన దర్యాప్తులో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి మృతిచెందాడు. పోలీసులు క్రైం సీన్​ రీక్రియేషన్​ చేస్తుండగా ఇది జరిగింది. అస్సాంలోని నాగావ్‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ఓ బాలిక(14) ట్యూషన్‌‌‌‌ కు వెళ్లి..  సైకిల్‌‌‌‌పై ఇంటికి వస్తుండగా దారిలో బైక్‌‌‌‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. 

ప్రస్తుతం ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన  తఫజుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్​ చేశారు.  దర్యాప్తులో భాగంగా క్రైం సీన్​రీక్రియేట్​ చేసేందుకు తఫజుల్​ను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. కాగా, ఆ సమయంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులోకి దూకాడు.

పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ నిర్వహించారు. 2 గంటల అనంతరం రెస్క్యూ బృందం తఫజుల్​ మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ ఘటనలో తమ కానిస్టేబుల్​కు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.తఫజుల్​ అంత్యక్రియల బహిష్కరణనిందితుడి స్వస్థలమైన బోరభేటిలో అంత్యక్రియలను గ్రామస్తులు బహిష్కరించారు. అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనకూడదని, గ్రామ స్మశాన వాటికలో ఖననాన్ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.